*ఖాజీపేట మండలం, రావులపల్లె పంచాయతీ పాటి మీద పల్లెకు చెందిన కీర్తిశేషులు రాయవరం చంద్రయ్య శ్రేష్టి సతీమణి శ్రీమతి రాయవరం రమణమ్మ(85) అనారోగ్యంతో బుధవారం మరణించారు.వారి స్వగ్రామం పాటిమీద పల్లెలోని వారి స్వగృహంలో రాయవరం రమణమ్మ మృతదేహం పై తెదేపా రాష్ట్ర కా ర్యనిర్వాహక మాజీ కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తెదేపా సీనియర్ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి లు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి సంతాపం ప్రకటించారు వారి కుటుంబ సభ్యులు పరామర్శించి వారి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రమణమ్మ మమ్మల్ని ఆప్యాయంగా పలకరించే వారిని అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం రమణమ్మ కుటుంబ సభ్యులు, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు*
