Tv424x7
Andhrapradesh

పోలీస్ శాఖలో,మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీస్ యోగాంధ్ర నిర్వహిస్తున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు

విజయవాడ సెంట్రల్, మే 30, బహుజన న్యూస్ ప్రతినిధి:పోలీసు శాఖలో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీసు యోగాంధ్రా నిర్వహిస్తున్న విజయవాడ,నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు.11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా,బి.ఆర్.టి.ఎస్.రోడ్డు వద్ద,ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ పరిదిలో పోలీసు శాఖలో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి ఆద్వర్యంలో,పెద్ద ఎత్తున పోలీసు యోగాంధ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రెటరీ కె.విజయానంద్, హెల్త్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆర్.జయలక్ష్మీ, నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి.రాజ శేఖర బాబు, ఈగల్ ఐ.జి. ఆకే రవి కృష్ణ ఐ.పి.ఎస్, ఐ.జి. రాజ కుమారి ఐ.పి.ఎస్, ఐ.జి. రత్న కుమారి ఐ.పి.ఎస్, జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, శ్రీ వీరపాండ్యన్, ఇతర ఐ.ఎ.ఎస్. అధికారులు, డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., తిరుమలేశ్వర రెడ్డి, శ్రీ కృష్ణ మూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఎన్.టి.ఆర్.జిల్లా లా & ఆర్డర్, ట్రాఫిక్, ఇంటిల్ జెన్స్,ఆక్టోపస్,ఎస్.ఎస్.జి., ఐ.ఎస్.డబ్ల్వ్యూ, హోంగార్డ్స్, సైబర్ సోల్జర్స్, సురక్ష, ట్రాఫిక్ అంబాసిడర్స్, ఆయుష్, ఓం శాంతి, బ్రహ్మ కుమారీస్, అమరావతి యోగా, పతంజలి ఆర్ట్ ఒఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, IGMS, మదర్సా మొదలగు యోగా డిపార్ట్మెంట్ వారు, పెద్దఎత్తున యోగా ఔత్సాహికులు సుమారు 6000 మంది పాల్గొని యోగాస‌నాలు అభ్యసించారు.

Related posts

తిరుపతి సమీపంలో చైనీస్ గూఢచారి డ్యుయంగాన్ கைது: IB-RAW రహస్య విచారణ ప్రారంభం

TV4-24X7 News

ఔట్ సోర్సింగ్ టీచర్లకు భారీగా జీతాలు పెంపు

TV4-24X7 News

న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా నూతన కలెక్టర్ రాజకుమారి

TV4-24X7 News

Leave a Comment