ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపికబురు చెప్పింది. ఏపీసదరం సర్టిఫికెట్లు,PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సదరం సర్టిఫికెట్లు, PMJAY వయో వందన హెల్త్ స్కీమ్ గురించి చర్చించారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance) ద్వారా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అర్హత లేని వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ PMJAY వయో వందన పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యునిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు (UDID)లను రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 70 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పీఎంజేఏవై వయో వందన పథకం కింద రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు మంత్రిడోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ఈ పథకానికి ఎలాంటి సామాజిక, ఆర్థిక నిబంధనలు లేవని తెలిపారు. అంటే, ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది ఈ పథకానికి అర్హులు ఉంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.UDID కార్డుల జారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం పోర్టల్‌ను యూడీఐడీ(UDID) పోర్టల్‌ను అనుసంధానం చేసి స్లాట్ బుకింగ్‌కు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.స్లాట్ బుక్ చేసుకున్నప్పటి నుంచి నెల రోజుల్లోపు దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ మేలు చేసేందుకు UDID కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల దివ్యాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీని ద్వారా ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగ శాతం 40 కన్నా తక్కువగా ఉంటే తెలుపు రంగు కార్డు ఇస్తారు. 40% నుంచి పైబడి 80 ఏళ్లలోపు ఉన్న వారికి పసుపు రంగు కార్డు ఇస్తారు. దివ్యాంగ శాతం 80 లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి నీలం రంగు కార్డును జారీ చేస్తారు. దివ్యాంగుల శాతం ఆధారంగా కార్డులు ఇస్తారు. ఈ మేరకు మంత్రి స్వామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

previous post