Tv424x7
Andhrapradesh

ప్రకాశం జిల్లా పొదిలిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు..

కమిషనర్ నారాయణ రెడ్డి,శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీ రావు కలసి తమ సిబ్బందతో ఆక్రమణలు తొలగింపు..పొదిలి నగర పంచాయతి పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ సెంటర్లలో పంచాయతీ స్థలాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన దుకాణాలు, తోపుడు బండ్లు,హద్దులు దాటి ముందుకొచ్చిన రేకులు, హోర్డింగులు, బోర్డులు తొలగింపు..పొదిలి నగర పంచాయతీ పరిధిలో ఎక్కడైనా సరే పరిధి దాటి ముందుకొంచిన దుకాణాలు కానీ, బోర్డలు కానీ, సైడ్ కాలువలు మీద ఆక్రమణలు కానీ ఎవరికి వారు వ్యక్తిగతంగా తొలగించుకుంటే మంచిదని లేకపోతే తాము చర్యలు తీసుకుని చట్టపరమైన కేసులు నమోదు చేయవలసివస్తుందని హెచ్చరించిన కమిషనర్ కె.ఎల్.నారాయణ రెడ్డి..త్వరలో మెయిన్ రోడ్డు, విశ్వనాధపురం, వీధుల్లో కూడ ఇలాగే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరికలు..రహదారి వెంబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా బోర్డలు, రేకులు వేసే వారిపై కూడ చర్యలు…ఎన్నో ఏళ్లుగా పొదిలి నగర పంచాయతీ అభివృద్ధిలో ఎటువంటి మార్పు లేదు ఇప్పటికైనా ప్రజలు, వ్యాపారస్థులు అందరూ సహకరించాలని, మన పొదిలి అభివృద్ధికి సలహాలు, సూచనలు కూడ అందించాలని కోరిన కమిషనర్ నారాయణ రెడ్డి…

Related posts

24 వ వార్డు కార్పొరేటర్ పద్మా రెడ్డి చేతుల మీదగా జీవీఎంసీ వర్కర్స్ కి బట్టలు అందజేత

TV4-24X7 News

ఇద్దరికీ హెల్మెట్‌ ఉండాల్సిందే- రోడ్డుపైనే చలాన్లు వసూలు- బండి సీజ్‌- ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం

TV4-24X7 News

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా..మాజీ మంత్రిఅంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు..

TV4-24X7 News

Leave a Comment