ఇండియాలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 164 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ 164 కరోనా కేసులలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి.కేరళలో 24 గంటల్లోనే.. 69 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు మహారాష్ట్రలో 44 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 34 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఓవరాల్ గా ఇప్పటివరకు.. 257 కరోనా యాక్టివ్ కేసులు ఇండియా వ్యాప్తంగా ఉన్నట్లు అధికార ప్రకటన కూడా విడుదలైంది. కరోనా మహమ్మారి పట్ల టెన్షన్ అవసరం లేదని… జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
