కడప జిల్లా కాశినాయన మండలం ఇటుకుళ్లపాడు గ్రామ సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహులు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్వేష్,వీరయ్య,పోలయ్య లు డిమాండ్ చేశారు.. బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలోని ఏవో కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు.. భూమి సర్వే చేయుట కొరకు ప్రభుత్వానికి చలానా చెల్లించినప్పటికీ సర్వేయర్ కొలతలకు వస్తే వేల రూపాయల డిమాండ్ చేస్తున్నాడని వారు ఆరోపించారు.. బోర్ పాయింట్స్ కు సర్వే రిపోర్ట్ ఇవ్వాలంటే 2500 నుండి 3000 వరకు డిమాండ్ చేస్తున్నారన్నారు.. ఇలాంటి అవినీతి సర్వేయర్ పై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేసిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడ్డారు.. ప్రజలను పట్టిపీడిస్తున్న ఇలాంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.. అతనిపై సమగ్ర విచారణ చేసి సస్పెండ్ చేయాలన్నారు.. లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు..
