మైదుకూరు/దువ్వూరు : కడపజిల్లాలో మీచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అందుకోవాలని ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి కోరారు. బుధవారం దువ్వూరులో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాలో వర్షాలు లేక బోరు బావులు కింద సాగుచేసిన వరి పంట చేతికందే సమయంలో తుఫాను దాటికి రెండు రోజులుగా కురిసిన వర్షానికి వరి పంట నేలకు వరికి వర్షానికి మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చాలామంది రైతులు కోసి పంట చేలలో కుప్పలుగా పోయడంతో ధాన్యం రంగు మారడంతో వ్యాపారులు ముందుకు రాలేదని, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. ఉద్యానవన పంటలైన బొప్పాయి, అరటి, టమోటా, పంటలకు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి నష్టపోయిన రైతుల జాబితా తయారుచేసి జిల్లా అధికారులకు అందజేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంట నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందిస్తానని తెలిపారు .ఇప్పటికైనా జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్పందించి జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.డి వి ఆర్ 1 తుఫాన్ వల్ల నేలకొరిగిన వరి పంటడి వి ఆర్ 2 ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి
