Tv424x7
Andhrapradesh

వై నాట్ పులివెందుల…? : చంద్రబాబు ‘మహా’ప్లాన్

కడప గడపలో వైసీపీని ఖాతా తెరవకుండా చేయాలని ఫిక్స్ అయిందా?

పులివెందుల సీటును కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుందా?

జగన్ జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఖాయమని మహానాడు సాక్షిగా చంద్రబాబు ఇండికేషన్స్ ఇచ్చారా?

అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.జగన్ రెడ్డి సొంత జిల్లా మహానాడులో మొదటిసారి మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం వెనక పెద్ద ప్లానే ఉంది. మొన్నటి ఎన్నికల్లో కడపలోని 10అసెంబ్లీ స్థానాలకు కూటమి ఏకంగా ఏడు కైవసం చేసుకుంది. బలంగా ఉండే కడప జిల్లాలో వైసీపీ కేవలం మూడంటే మూడు స్థానాలకే పరిమితమైంది. అంటే కూటమి వేవ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు ఇంకాస్త కష్టపడితే వైసీపీకి మూడు స్థానాలు కూడా దక్కేవి కావన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ పాగా వేస్తామని ఆయన చెప్పకనే చెప్పేశారు అన్నమాట.జగన్ ఇలాకాలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. జగన్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పై ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అక్రమాస్తుల కేసులో జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్ళవచ్చు.ఇదీ ఒక్కటేనా లిక్కర్ స్కామ్ కేసు కూడా రెడీగా ఉంది. ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్తే గతంలో లాగా చెల్లి, తల్లి పార్టీని మోసే అవకాశం లేదు. భార్య అన్ని తానై నడిపించినా, ఆమెకు ప్రజల పల్స్ ను పసిగట్టెంత సీన్ లేదనేది ఓపెన్ సీక్రెట్. మిగిలిన నేతల్లో ఎవరికైనా పార్టీని నడిపించే సామర్ధ్యం ఉందా అంటే ఎవరికీ లేదు. దీంతో వైసీపీ ఫ్యూచర్ ని అంచనా వేసే చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో కడపలో స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది.

Related posts

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

Leave a Comment