Tv424x7
Telangana

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. –అడ్డుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ముందు శనివారం రాత్రి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడన ఘటన చోటుచేసుకుంది. కాగా వివరాల్లోకి వెళ్తే, పిచ్చిరామ్ తండాకు చెందిన నూనావత్ వినోద కుటుంబ తగాదాలో తనకు న్యాయం జరగడం లేదంటూ స్టేషన్ గేటు ఎదుట మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.తన భర్త నరేందర్ విడాకుల విషయంలో పరిహారం ఇవ్వడాన్ని తిరస్కరించగా, వినోద న్యాయం కోసం శుక్రవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డా.రాంచంద్రు నాయక్ కు మొరపెట్టుకుంది. ఎమ్మెల్యే సూచనతో పోలీసులు శనివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే సమస్య పరిష్కారమవక పోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకొని,హుటాహుటిన 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు….రంగంలోకి మంత్రుల బృందం?

TV4-24X7 News

న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు… తెరపైకి పూర్ణచందర్ భార్య

TV4-24X7 News

ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు…

TV4-24X7 News

Leave a Comment