Tv424x7
Andhrapradesh

ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో మంగళవారంరాత్రి వరకు అన్ని రకాల ఆన్లైన్ సర్వీసులు నిలిచిపోనున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. ఏపీ సేవ పోర్టల్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి రాష్ట్ర డేటా సెంటర్ కు తరలిస్తున్న కారణంగా ఈ అంతరాయం కలగనున్నట్టు ఆ శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో సైతం కొన్ని రకాల సేవలు నిలిచిపోతాయని వివరించారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీ కరణ పత్రం, భూమి మ్యుటేషన్లు, రేషన్ కార్డు ఇళ్ల స్థలాల పట్టాల దరఖాస్తులు వంటివి, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ, వాటర్ ట్యాక్స్, పట్టణ పరి పాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు మీ-సేవలో సైతం అందుబాటులో ఉండవని వివరించారు. ఇతర ప్రభుత్వ సేవలు మాత్రం మీ-సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Related posts

కడపలో “వైసీపీ మోనార్క్‌”లకు ఇక గడ్డు కాలమే !

TV4-24X7 News

నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..

TV4-24X7 News

బాపట్లలో యువకుడు దారుణ హత్య..

TV4-24X7 News

Leave a Comment