Tv424x7
Andhrapradesh

వణ్య ప్రాణులను వేటాడిన నిందితులు అరెస్ట్

అన్నమయ్య జిల్లా ములకళచెరువు అడవి పందులను వేటాడే ఇద్దరిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మదనపల్లె ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు,ములకళచెరువు సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్ లు సోమవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకళచెరువు మండలం పరిధిలోని బురకాయల కోట, వేపూరి కోట, నేరేడికొండ బీట్లలో వన్య ప్రాణులను రోజూ వేటాడి, మాంసం తరలిస్తున్నట్లు సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్ కు పక్కా సమాచారం అందింది అన్నారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వెళ్లి ములకళచెరువు మండలం, ఒడ్డిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలాల్లో సత్యసాయి జిల్లా, కదిరి వీరాస్ కాలనీకి చెందిన బి. రమేష్ కొడుకు బాలాజీ(23), ములకళచెరువు రామాపురం కు చెందిన డి.చిన్న నాగన్న కొడుకు మంజునాథ(30) లను పట్టుని, మాంసం, మారణాయుధాలు సీజ్ చేసిందని ఎఫ్ఆర్ఒ తెలిపారు. అనంతరం నిందితులపై 1972 వణ్య ప్రాణుల చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా భావించి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని తెలిపారు.

Related posts

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

TV4-24X7 News

అరుణాచలం గిరి ప్రదక్షణ భక్తులకు అన్నదానం నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

పశ్చాత్తాపం తో భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య?

TV4-24X7 News

Leave a Comment