Tv424x7
Andhrapradesh

బద్వేల్ పట్టణంలోని టీబీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న STLS బ్రహ్మయ్య పై చర్యలు తీసుకోవాలి:-AIYF

బద్వేల్ పట్టణంలోని సీమాంక్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న STLS బ్రహ్మయ్య పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య AIYF కడప జిల్లా అధ్యక్షులు పెద్దుళ్ళపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు.సీమంక్ ఆసుపత్రిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…. గత నాలుగు సంవత్సరాలుగా బద్వేల్ పట్టణంలోని సీమాంక్ హాస్పిటల్ లో క్షయ వ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్టిఎల్ఎస్ బ్రహ్మయ్య సరిగా విధులకు హాజరు కాకుండా కడప కేంద్రంలోని ఒక హాస్పిటల్లో ప్రైవేట్ లాబ్ పెట్టుకొని ల్యాబ్లో పని చేసుకుంటూ బద్వేలులో విధులకు నెలలో కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే హాజరవుతూ ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులు నమూనాలు ఇస్తే ఆ శాంపిల్స్ ని కూడా నెలలు నెలలు ఇక్కడే నిల్వ ఉంచుతూ వాటికి కనీస భద్రత లేకుండా కేవలం ఒక చిన్న బాక్సులో పెట్టి ఐస్ లేకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అతనికి బద్వేల్ నియోజకవర్గంతో పాటు దువ్వూరులో కూడా విధుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి రిజిస్టర్ లో రాయకుండా ఎఫ్ఆర్ఎస్ ను కూడా తప్పుదోవ పట్టించి విధులకు రావడంలేదని వారు ఆరోపించారు. ఇతనిపై అధికారుల చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తనదే అధికారం అంటూ విధులకు హాజరు కావడం లేదు. కాబట్టి జిల్లా వైద్యశాఖ అధికారులు బ్రహ్మయ్య పై చర్యలు తీసుకొని వీధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మధు శివకుమార్ వ కుమార్ లు పాల్గొన్నారు

Related posts

పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా వియ్యపు చిన్నా

TV4-24X7 News

దివ్య ఫార్మసీ (పతంజలి) ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ రద్దు

TV4-24X7 News

జేడీ వాన్స్ దంప‌తుల‌ను ఏపీకి ఆహ్వానిస్తాం: సీఎం చంద్ర‌బాబు

TV4-24X7 News

Leave a Comment