రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు జరిగిన రెవెన్యూ దినోత్సవ రోజు కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రమోహన్ గారిచే రెవెన్యూ వ్యవస్థ ద్వారా కడప జిల్లాలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు సేవా సమితి పేరుతో సమితి జిల్లా అధ్యక్షులు ఏవి.రమణ గారు జిల్లాలో సమస్యలను ఎక్కడికి అక్కడ స్థానిక మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈరోజు బద్వేల్ లో జరిగిన కార్యక్రమంలో ఏవి.రమణ గారికి ఆర్డీవో చంద్రమోహన్ గారు సన్మానం చేసి భవిష్యత్తులో కూడా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని రమణ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో రమణ గారితో పాటు బద్వేల్ రెవిన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఈ విధద శాఖల ఉద్యోగులను కూడా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రమణ గారు మాట్లాడుతూ ఈరోజు జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమానికి బద్వేల్ ఆర్డిఓ గారు నాకు పాల్గొనే అవకాశం కల్పించి రైతునేతగా నేను చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి సన్మానం చేయడం వల్ల భవిష్యత్తులో కడప జిల్లాలో రైతు సేవా సమితి రైతుల, ప్రజలతో కలిసి జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులైన తెలుగు గంగ, రాజోలి, జోలధరాశి, గాలేరు నగిరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు, అలాగే రెవెన్యూ వ్యవస్థ ద్వారా రైతులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం మరింత స్థాయిలో ఉద్యమించేందుకు బాధ్యత పెంచిందని రమణ గారు అన్నారు.
