ఏమయినా అడిగితే అకౌంట్స్ హోల్డ్ కమలాపురం లోని అడ్డరోడ్డు కూడాలి వద్దగల పంజాబ్ నేషనల్ బ్యాంకు లోని అధికారులు కస్టమర్ల పట్ల నిర్లక్షము వ్యవహారిస్తున్నారు. వివరాలలోకి వెళితే బ్యాంకు నందు గల అధికార్లు వినియోగదారులు ఏ పని మీద బ్యాంకు కు వచ్చిన సమయం వృధా చేస్తూ కస్టమర్ల సహనంతో అడుకొంటున్నారు. డబ్బులు కట్టిన లోన్స్ క్లోజ్ చేయడానికి గంట సమయము పడుతుంది అని చెబుతున్నారు. 90 నిముషాల(గంట 30 నిముషాలకు) తరువాత వచ్చిన ఇంకా టైమ్ పడుతుంది అంటూ మూసాధోరణిలో వ్యవహారిస్తున్నారు. ఈ బ్యాంకు నందు ఇది కొత్తేమి కాదు ప్రతిరోజూ ఏదోఒక కస్టమర్ తో బ్యాంకు అధికారులు గొడవపడుతూనే వున్నారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉదయం బ్యాంకు కు వస్తే సాయంకాలం వరకు ఇక్కడే సమయం వృధా చేసుకుంటూ వేరే పనులు చేసుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇలాగే గోల్డ్ లోన్ కోసం వచ్చిన కస్టమర్ తో గొడవపడి నువ్ ని అకౌంట్ లో ట్రాన్సాక్షన్ ఎక్కువగా చేసావ్ అని చెప్పి అతని అకౌంట్ హోల్డ్ లో పెట్టిన పాపాన పోలేదు. ఇప్పటికయినా బ్యాంకు ఉన్నత అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు కోరుచున్నారు.
