ఆంధ్రప్రదేశ్లో వైద్య, ఆరోగ్యశాఖలో తాజాగా మహిళ అభివృద్ధి కోసం ఏకంగా ఆశ వర్కర్లకు సంబంధించి 1294 పోస్టులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పోస్టులకు కేవలం పదవ తరగతి అర్హతతో భర్తీ చేయబోతున్నారు.గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలకు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.అభ్యర్థుల వయో పరిమితి విషయానికి వస్తే.. 25 నుంచి 45 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి.. అలాగే రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి సదులింపు ఉంటుంది. ఎవరైనా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటే దరఖాస్తు ఫారం ని డౌన్లోడ్ చేసుకొని అందుకు సంబంధించిన పత్రాలను జత చేసి దగ్గరలో ఉండే మెడికల్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి మరి స్వయంగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఒక్కో గ్రామానికి ఒక్క ఆశ వర్కర్ ని ఎంపిక చేస్తారు.. ఇక శిక్షణ అనంతరం కాంట్రాక్ట్ ప్రతిపాదికన పద్ధతిలో వీరిని తీసుకోబోతున్నారు.జిల్లాల వారీగా పోస్టుల విషయానికి వస్తే..1). అల్లూరి సీతారామరాజు జిల్లా- 124
2). చిత్తూరు-69
3). కోనసీమ-79
4). వెస్ట్ గోదావరి-65
5).విశాఖపట్నం-68
6).పల్నాడు-63
7).ప్రకాశం జిల్లా 63
8). ఎన్టీఆర్జిల్లా 61
9).అనకాపల్లి-61
10).ఏలూరు 55
11).బాపట్ల 55
12).వైయస్సార్ కడపజిల్లా – 55
13).కర్నూలు 46
14).శ్రీకాకుళం 49
15).గుంటూరు 37
16).కాకినాడ 42
17).నంద్యాల 31
18).మాన్యం జిల్లా 34
19).ఈస్ట్ గోదావరి 30
20).కృష్ణ 26
21).తిరుపతి 27
22).అన్నమయ్య జిల్లా 19
23).నెల్లూరు 16
24).విజయనగరం 15
25). అనంతపురం-58
26). సత్య సాయి జిల్లా – 46జూన్ 18 నుంచి అప్లికేషన్ మొదలు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఈ నెల 30వ తేదీ.. ఆయా జిల్లాలలో వారు ఆ జిల్లాలలోనే అప్లై చేసుకోవాలి.