జూలై నెలలో అన్నదాత సుఖీభవ డబ్బులు
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తి. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదవ్వాలని అధికారులు తెలిపారు. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని, అటువంటివారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.