Tv424x7
National

పూరి జగన్నాథుని విగ్రహంలో బ్రహ్మ పదార్థం.. దీని స్టోరీ ఏంటంటే.?

కురుక్షేత్ర యుద్ధం తర్వాత నేలకోరిగిన తన వంద మంది కుమారులను చూసిన గాంధారి యాదవ వంశమంతా అంతరించిపోవాలని శపించింది. అభాగ్యురాలిని గురురాజమాతను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. యాదవ వంశంలో మిగిలిన ఆఖరి పురుషులే బలరాముడు శ్రీకృష్ణుడు బలరామ అవతారం తనువుని ఆదిశేషువు బయటికి రావడం చూసిన శ్రీకృష్ణుడు తాను కూడా తన అవతారాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకుంటాడు. జర అనే ఒక బోయివాడు శ్రీకృష్ణుడి కాళ్ళు చూసి జింక అని పొరబడి బాణాన్ని సంధిస్తాడు. తన బాణం శ్రీకృష్ణ పరమాత్మునికి తగిలిందని తెలుసుకున్న జర తీవ్ర శోకానికి గురవుతాడు. అది తన తప్పిదం కాదని పూర్వ జన్మలో వాలి సుగ్రీవుల యుద్ధ ఫలిత రుణమని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతలోనే రక్తం ముడుగులో పడి ఉన్న శ్రీకృష్ణుడిని అర్జునుడు చూసి తీవ్ర శోకానికి గురవుతాడు. తన అవతారం చాలించిన వెంటనే తన దేహానికి దాహన సంస్కారం చేయాలని అర్జునికి శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతటితో ఆ శ్రీకృష్ణుడి అవతారం ముగుస్తుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ పరమాత్ముడి దేహాన్ని అర్జునుడు దాహనం చేస్తాడు. శరీరమంతా కాలి బూడిదవుతుంది గాని శ్రీకృష్ణుడి హృదయం మాత్రం దహనం కాదు. అది నీలి రంగులో ప్రకాశవంతమైన ఒక మణిలా కనిపిస్తుంది. దానినే ఇప్పుడు పిలవబడే బ్రహ్మ పదార్థం అని కూడా అంటారు. ఆ హృదయాన్ని ఏం చేయాలో తెలియని అర్జునికి శ్రీకృష్ణుడు కళలోకి వచ్చి ఒక వేప దుంగకి ఆ హృదయాన్ని కట్టి సముద్రంలో వదిలేయమని చెప్తాడు. అలా ద్వారకా సముద్రంలో మొదలైన శ్రీకృష్ణుడి హృదయం సముద్రాలను దాటుకుంటూ పూరి నగరానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మునిపై బాణం సంధించిన జర విశ్వభసు అనే పేరుతో పూరి నగరం ఆటవికుల ప్రాంతంలో జన్మిస్తాడు. పూరికి చేరుకున్న శ్రీకృష్ణుడి హృదయం విశ్వభసుకు దొరుకుతుంది. ఆ హృదయాన్ని అడవిలో తనకు మాత్రమే తెలిసిన చోట భద్రపరిచి దానికి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు విశ్వభసు. తన వల్లే జగన్నాధుడి విగ్రహాలు సకంలో ఆగిపోయాయని బాధపడుతున్న ఇంద్రద్యుమ్నుడికి బ్రహ్మ పదార్థం విశ్వభసు రాజ్యంలో ఉందని తెలుసుకుంటాడు. దానిని తీసుకొచ్చి జగన్నాధుడి విగ్రహాల చిత్రం చేరుద్దాం అనుకుంటాడు. విశ్వభసు కూతురిని పెళ్లి చేసుకోమని ఇంద్రద్యుమ్నుడు తన అనుచరుడిని పంపిస్తాడు. తన కూతురుతో వివాహం జరిగిన తర్వాత విశ్వభసు తన అల్లుడికి కళ్లకు గంతలు కట్టి అడవి మార్గంలో తీసుకెళ్లి ఒక గుహలో ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపిస్తాడు. అది చూసిన అనుచరుడు ఇంద్రద్యుమ్నుడికి ఈ వార్తను చేరవేస్తాడు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు తన సైన్యంతో విశ్వభసు పాలిస్తున్న రాజ్యానికి బయలుదేరుతాడు. ఇంద్రద్యుమ్నుడు విశ్వభసును కలిసి ఆ గుహ దగ్గరికి తీసుకు వెళ్ళమని చెప్తాడు.రాజాజ్ఞ మేరకు విశ్వభసు గుహ దగ్గరికి తీసుకు వెళ్తాడు. చూడబోతే అక్కడ ఆ బ్రహ్మ పదార్థం కనబడదు. అది కేవలం విశ్వభసుకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రద్యుమ్నుడికి కనిపించి విశ్వభసు మాత్రమే ఆ బ్రహ్మ పదార్థాన్ని చూడగలడు. ఆ బ్రహ్మ పదార్థాన్ని నా చెంతకు చేర్చగలడు అని చెప్తాడు. అలా ఆ బ్రహ్మ పదార్థం పూరి జగన్నాధుడి ఆలయాన్ని చేరింది.ప్రతి పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలకి నవకళేవరోత్సవం జరుగుతుంది. అంటే జగన్నాధుడి పాత విగ్రహాలను తీసి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ ఉత్సవం జరిగినప్పుడే ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక వృద్ధుడికి కళ్ళకు గంతలు కట్టి ఒళ్ళంతా పట్టు వస్త్రాలు చుట్టి గుడిలోకి పంపిస్తారు. ఆ వృద్ధుడు పాత విగ్రహాల్లో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతాడు.

Related posts

బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు

TV4-24X7 News

ఆంజనేయుడి గుడి కడదామని పునాదులు తవ్వుతున్నారు.. ఇంతలో అద్భుతం

TV4-24X7 News

మెడికల్ కాలేజీకి 124 ఏళ్ల చరిత్ర.. ఎంబీబీఎస్‌ ఫీజు రూ.3,000 మాత్రమే..!

TV4-24X7 News

Leave a Comment