కడప /మైదుకూరు :దువ్వూరు మండలంలో పలు గ్రామాలలో కొలువు దీరిన పీర్లు.ప్రతి ఏటా గ్రామాలలో మొహరం పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు . మంగళవారం మండల పరిధిలోని చిన్న సింగన పల్లెలో పీర్లను ప్రత్యేక అలంకరణలో పీర్ల చావడీలల్లో కోలువు తీరిన పేర్లను అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ తోట్టికి తీసుకెళ్లారు . ముగింపురోజు హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా గ్రామాలలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పీర్ల ఊరేగింపులలో పాల్గొని భక్తిని చాటు కున్నారు. పీర్ల చావడీ నుండి పీర్ల ఊరేగింపు అనంతరం చిన్న సింగన పల్లె తొట్టి బావి దగ్గరబోరు బావుల దగ్గర,శుభ్రపరిచి మళ్లీ ప్రత్యేక పెట్టెలో ఉంచారు .పెద్ద పీరయ్య, లాలు స్వామి, బాబా ఫక్రుద్దీన్ స్వామి, చిన్న పీరయ్య, బాదుల్లా పీర్లును భక్తులు భక్తిశ్రద్ధలతో కొలిచారు . పీర్ల ఊరేగింపులో చిన్న సింగన పల్లె చుట్టుపక్కల గ్రామప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పీర్ల స్వామిని దర్శించుకున్నారు
