సిద్ధమైన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా – రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో అర్హులైన రైతుల పేర్ల జాబితాలుఅన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా సిద్దమైంది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతు సేవా కేంద్రంలో ఉన్న జాబితాలో రైతులు వారి పేర్లును పరిశీలించుకోవచ్చని వ్యవసాయ సంచాలకులు డిల్లీరావు తెలిపారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చని వెల్లడించారు.మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఆధార్ నెంబర్ను మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009కు పంపితే వివరాలు లభ్యమవుతాయని సూచించారు. రైతు పేరు లేని పక్షంలో, అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోనీ గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉంది
