Tv424x7
Cinima News

టీకా కోసం 20 కి.మీ.నడిచిన వృద్ధురాలు

కుక్కకాటుకు గురైన 92 ఏళ్ల వృద్ధురాలు రేబిస్‌ టీకా కోసం 20 కిలోమీటర్లు నడిచారు. ఒడిశాలో ఈ దయనీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు రెండు రోజులుగా సమ్మె బాట పట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సమ్మె నువాపడ జిల్లా సీనాపల్లి సమితి శికబాహల్‌ గ్రామానికి చెందిన మంగల్‌బారి మోహరా(92)కు శాపంగా మారింది. ఇటీవల ఆమెను కుక్క కరవడంతో సీనాపల్లి సీహెచ్‌సీలో చికిత్స తీసుకున్నారు. బుధవారం టీకా వేయించుకోవాల్సి ఉంది. సమ్మె కారణంగా ఏ వాహనమూ లేకపోవడంతో తన ఊరి నుంచి 10 కి.మీ. దూరంలోని సీనాపల్లికి కాలినడకన వెళ్లారు. టీకా వేయించుకున్నాక మళ్లీ నడిచే ఇంటికి చేరుకున్నారు.

Related posts

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

TV4-24X7 News

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ

TV4-24X7 News

రజిని, షారుక్ రికార్డులను ప్రభాస్ చిత్తు…1000 కోట్లపై కన్నేసిన కల్కి…

TV4-24X7 News

Leave a Comment