తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం
మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇస్తారు.. నీటిపారుదల శాఖ ఎఫ్‌టీఎల్ అంటారు
శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయి అంటూ హైకోర్టు వ్యాఖ్యలు
జవహర్‌నగర్ కాంపౌండ్ వాల్ కూల్చివేసి డ్రైనేజీ నీటిని తన ప్లాట్లోకి విడిచిపెడుతూ నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన పల్లె నర్సింహారెడ్డి అనే వ్యక్తి
ఈ కేసు విచారిస్తూ రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తారు, మున్సిపల్ అధికారులు నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తారు, నీటిపారుదల వాళ్లు ఎఫ్‌టీఎల్ అని, నీటి ప్రవాహ మార్గమని చెప్తారు, అందుకే దశాబ్దాలుగా కొన్ని భూసమస్యలకు పరిష్కారం లభించడంలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు న్యాయమూర్తి బి.విజయసేన్ రెడ్డి
ఒక్కో శాఖ ఒక్కోరకంగా వ్యవహరిస్తే ఎలా? సమన్వయత్వం ఉండాలి కదా? అంటూ ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన పిటిషన్లు అనుమతించి, వాటికి భూసేకరణ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తేనే భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి
పార్కింగ్ సమస్యకు సంబంధించిన మరో కేసు విచారిస్తూ, పార్కింగ్ లేనిది ప్రజలు ఫ్లాట్ కొనవద్దని సూచించిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం