అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. 10 రోజుల యాత్రలో పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవుని ఆలయం, డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం,వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, గంగా హారతి సందర్శనతో పాటు అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం వంటి పుణ్యక్షేత్రాలను కవర్‌చే స్తారని వెల్లడించారు. మార్గమధ్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. యాత్ర ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ధర రూ.17వేలు, త్రీటైర్ ఏసీ రూ.26,700, టూటైర్ ఏసీ టికెట్ ధర రూ.35వేలని తెలిపారు. ప్యాకేజీలో భాగంగా భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తారని, వెల్లడిచారు. వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చన్నారు..

previous post