Tv424x7
Telangana

హైకోర్టులో నిరాశ… కాళేశ్వరం నివేదికపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికనివేదికను రద్దు చేయాలన్న కేసీఆర్, హరీశ్ ల వినతిని తిరస్కరించిన హైకోర్టుసుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ, ఇప్పుడు ఏకంగా కమిషన్ నివేదికనే రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటానికి దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం… వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పలువురు సీనియర్ న్యాయవాదులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.గతంలో కాళేశ్వరం విచారణకు తాము సిద్ధమని స్వయంగా కేసీఆర్, హరీశ్ రావు కమిషన్ ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. అయితే, కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత బీఆర్ఎస్ వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి, దానిపై సమగ్రంగా చర్చించాలని భావిస్తోంది. సభలో చర్చించిన అనంతరం, తదుపరి దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించాలా? లేక సీఐడీకి బదిలీ చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ తదుపరి విచారణకు ఆదేశిస్తే, కేసీఆర్, హరీశ్ రావు విచారణ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

Related posts

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్… నేడు భారీ వర్షాలు..

TV4-24X7 News

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

TV4-24X7 News

హైదరాబాద్‌ జూలో బెంగాల్ టైగర్ అభిమన్యు మృత్యువాత

TV4-24X7 News

Leave a Comment