ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి, (83) సురవరం సుధాకర్ రెడ్డి, మరణం తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆయన మరణం బాధాకరం అన్నారు. సౌమ్యుడు, మృధుస్వ భావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి,అని ఆయన అన్నారు.ఇక సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. అనా రోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింద న్నారు. తెలుగు వ్యక్తి సీపీఐ జాతీయ పార్టీ కార్యదర్శి గా పనిచేయడం జరిగిందని.. జాతీయ పార్టీకి నాయ కత్వం వహించారని చెప్పారు. తెలుగు వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని… సౌమ్యుడిగా.. అందరితో కలిసి మెలిసి ఉండేవారని.. గొప్ప మేధావిగా అభివర్ణించారు. వారి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పనిచేసిన వ్యక్తి అని.. సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తి అని తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందు లు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
