Tv424x7
Andhrapradesh

కడపలో బాడుగకు కార్లు ఇచ్చే వారికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక

కడప డివిజన్ సీకే దిన్నే మండలం పరిధిలోని అటవీప్రాంతంలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 26 ఎర్రచందనం దుంగలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని అందులో ఎర్రచందనం అక్రమ రవాణా చేయడం విశేషం. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో కడప సబ్ కంట్రోల్ ఆర్ఎస్ఐ ఎం. మురళీధర్ రెడ్డి టీమ్ శుక్రవారం సాయంత్రం నుంచి సీకే దిన్నే మండలం లోని మద్దిమడుగు ఫారెస్ట్ సెక్షన్ లో స్థానిక అటవీ సిబ్బంది షకీల్ అహ్మద్, నారాయణరెడ్డి తో కూంబింగ్ చేపట్టారు. కోలుములపల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఒక కారు వద్ద కనిపించారు. వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా వారు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకో గలిగారు. ఆ పరిసర ప్రాంతాల్లో వెతకగా 26 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలు, కారుతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డిఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ వారిని విచారించగా ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం బాడుగకు తీసుకుని వచ్చి అందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.టాస్క్ ఫోర్స్ ఎస్పీ హెచ్చరిక కార్లు బాడుగకు ఇచ్చేముందు వారి పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ అన్నారు. ఆ కార్లను ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించే పక్షంలో కారు యజమాని కూడా భాధ్యుడు అవుతారని, వారిపై కూడా కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు.

Related posts

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

TV4-24X7 News

నేడు కార్తీక పున్నమి

TV4-24X7 News

ఏపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment