Tv424x7
Andhrapradesh

విశాఖలో మూడు రోజుల పాటు “సేనతో సేనాని”

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖపట్నంలో 28 నుంచి 30 వరకు మూడు రోజుల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి “సేనతో సేనాని” అనే పేరు పెట్టారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి అంశాలపై చర్చలకు, దిశానిర్దేశానికి ఈ సమవేశాల్లో విస్తృతంగా చర్చిస్తారు. సుమారు 15,000 మంది కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు హాజరవుతారు.ఈ సమావేశాలను “పవిత్ర యజ్ఞంలా” నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆగస్టు 28. మొదటి రోజు శాసనసభ్యులు, కౌన్సిలర్ల సమావేశం ఉంటుంది. ఉదయం YMCAలో ఎమ్ఎల్‌ఏలు, ఎమ్ఎల్‌సీలు సమావేశం. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్థాయి కార్యకర్తలతో చర్చలు. జరుపుతారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో కూడా సమావేశం ఉంటుంది. ఆగస్టు 29న పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్త జిల్లా నాయకులు, పార్టీ ప్రతినిధులతో పలు స్థాయిల్లో చర్చలు నిర్వహిస్తారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెడతారు. మూడవ రోజు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగసభ నిర్వహిస్తారు. పార్టీ భవిష్యత్ విధానాలు, కూటమి ప్రభుత్వంతో సమన్వయం , పార్టీ కార్యకర్తల బలోపేతం వంటి అంశాలపై పవన్ దిశానిర్దేశం చేస్తారు.ఈ సమావేశాలు జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి, కార్యకర్తలలో ఉత్సాహాన్ని పెంచడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేసారు. ఏర్పాట్లను నాదెండ్ల మనోహర్ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత జనసేన పార్టీ క్యాడర్ కు మరింత స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం కలుగుతుందని భావిస్తున్నారు.

Related posts

సర్టిఫికెట్లపై ఇకపై నో పొలిటికల్ మార్క్!

TV4-24X7 News

ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

TV4-24X7 News

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత సిబ్బంది ఎలాంటిదో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment