హైదరాబాద్ మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం మెహదీపట్నం బస్టాండ్ లో బస్సును ఆపి ఉంచడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు పెట్టారు. మంగళవారం ఉదయం బస్ స్టాప్ వద్దకు రాగానే బస్సు స్టార్ట్ కాకపోవడంతో డ్రైవరు మరమ్మత్తుల కోసం పక్కకు నిలిపి రిపేరు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు…..

previous post