వెండి చెంబను 40 వేలకు దక్కించుకున్న వైఎస్ఆర్సిపి నేత రెడ్యo సునీల్ కుమార్ రెడ్డి
డబ్బుల దండను 37 వేలకు దక్కించుకున్న వైఎస్ఆర్సిపి నేత తవ్వా సతీష్ రెడ్డి.
కడప /ఖాజీపేట మండలం, దుంపలగట్టు గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులలు ఏర్పాటు చేసిన శ్రీ గణనాధుని3 రోజులు పాటు ప్రత్యేక పూజలను అందుకొని నాలుగవ రోజు బాణాసంచా పేలుళ్లతో… డప్పు వాయిద్యాలు నడుమ… డి. జె మోతలతో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు, ప్రజలు పాల్గొని గ్రామంలోని పురవీధుల్లో ఆర్భాటంగా, ఘనంగా, ఊరేగింపు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుంపలగట్టు గ్రామం లో కాజీపేట, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు..చెన్నూర్ లోని పెన్నా నదిలో నిమజ్జనం చేశారు.. శ్రీ గణనాధుని వేడుకల్లో ఆటలు పోటీలు, ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. అన్నప్రసాదాన్ని నిర్వహించి ఎంతో వైభవంగా ఈ వేడుకలను జరుపుకున్నారు..