ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రబలగాలు సైతం పహారా కాస్తున్నాయి.
previous post

