కడప జిల్లా దూవ్వూరు మండలం భీమునిపాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కేవలం పదివేల రూపాయల అప్పు వివాదమే ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది.స్నేహితుడు దివాకర్ పదివేల రూపాయల అప్పు తిరిగి ఇవ్వాలని పదేపదే ఒత్తిడి చేయడంతో దస్తగిరి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతో దివాకర్‌పై బండరాయితో దాడి చేసి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన దివాకర్‌ను స్థానికులు వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు
