ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే సత్తా చూపిస్తాం, మైదుకూరు లో గెలిచి చూపిస్తాం…….అంజు యాదవ్ భర్త నల్లబోయిన గంగాధర్ యాదవ్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్త రెడ్డి మకు అవకాశం ఇచ్చి మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆశీస్సులు ఇస్తే తమ సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు సిద్ధం అని ప్రముఖ సాఫ్ట్ వేర్ సీనియర్ హెచ్. ఆర్. మరియు అంజు యాదవ్ భర్త గంగాధర్ యాదవ్ అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తమ బలం, బలగం, బంధుత్వం, స్నేహితులకు తోడుగా జగనన్న దీవెనలు తోడుగా ఉంటే దేవుని దయ, నియోజకవర్గం ప్రజల అండదండలతో గెలుపు గెలిచి తమ సత్తా చాటగలమని గంగాధర్ ధీమా వ్యక్తం చేశారు.