కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.