తాడిపత్రి: రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో తాడిపత్రి మార్కెట్ యార్డ్ నందు రూమ్ నెంబర్ 37 లో నిర్మించిన గోడౌన్‌ను ఈ రోజు గౌరవ శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధికారులతో పాటు సహకార సంఘం డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. గోడౌన్ ప్రారంభం రైతులకు మెరుగైన నిల్వ సౌకర్యాలు అందించడంలో కీలక పాత్ర పోషించనుందని శాసనసభ్యులు తెలిపారు.
ఈ గోడౌన్ ఏర్పాటుతో తాడిపత్రి ప్రాంతంలోని రైతులకు వారి పంటలను సురక్షితంగా నిల్వ పెట్టుకునే అవకాశం కలగనుందని, తద్వారా మార్కెట్‌లో అనుకూలమైన ధరల కోసం వేచి చూసే అవకాశమూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.