Tv424x7
Andhrapradesh

భార్య గొంతు కోసిన భర్త

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భర్త భార్య గొంతు కోసి హత్యా యత్నానికి పాల్పడ్డ సంఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు కుటుంబీకులు మదనపల్లి తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పై వివరాలు ఇలా ఉన్నాయి. పీటీఎం మండలంలోని మల్లెలకు చెందిన టైలర్ ఫజల్ మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుంటే గులాబ్ జాన్ అలిగి మదనపల్లె లోని కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లు, తాళ్ల సుబ్బన్న కాలనీలో కాపురం ఉంటున్న పుట్టి నింటికి గులాబ్ జాన్ వచ్చింది. దీంతో ఆగ్రహించిన భర్త ఫజల్ అత్తగారి ఇంటిలో ఉన్న భార్య ఎస్కె గులాబ్ జాన్ ను గ్లాసుతో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆమెను చికిత్స కోసం స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ ఎన్ శేఖర్ పేర్కొన్నారు.

Related posts

టైలర్ ఆలోచన అదిరింది… అందరి చూపు అతనిపైనే

TV4-24X7 News

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

TV4-24X7 News

Leave a Comment