రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో విజయం సాధించిన గౌసియాను అభినందించిన ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి.ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆగస్టు 26న విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని డి. గౌసియా ప్రథమ బహుమతి సాధించారు.
ఈ సందర్భంగా గౌసియాను తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు తన కార్యాలయంలో ప్రత్యేకంగా కలసి అభినందించారు. విద్యార్థినికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ముంబైలో త్వరలో నిర్వహించబోయే జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట నారాయణ, నోడల్ అధికారి రాజేష్ చౌదరి, సూపర్వైజర్ రమణ, సిబ్బంది మురళి, RIDSS సిబ్బంది నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.