Tv424x7
Andhrapradesh

రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి…– బాలాజీ విద్యాసంస్థల అధినేత రవీంద్రనాథ్ రెడ్డి

జనవరి 7.8 తేదీల్లోజనవరి 7.8 తేదీల్లో కడప నగరం వేదిక జరిగే రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ 9వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని స్థానిక జమ్మలమడుగు పట్టణంలోని బాలాజీ విద్యాసంస్థల అధినేత రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం నాడు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది….ఈ సందర్భంగా ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులు. మరియు నిరుద్యోగులు. మేధావులు విచ్చేసి ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు. హాస్టల్స్ లో రెగ్యులర్ వార్డెన్స్ లేక ఇన్చార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తుందని దీంతో విద్యార్థులపై పర్యవేక్షణ కరువై నిత్యం విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. హాస్టల్స్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులకు.. కేజీబీవీలో ప్రారంభించిన ఇంటర్ కోర్సులకు అధ్యాపకులను నియమించకుండా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మామ అనిపించే విధంగా ఈ రోజున అటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందని అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు నెరవేర్చాలని. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని ఆయన అన్నారు. ఈ విధంగా అనేక సమస్యల పైన ఈ మహాసభల్లో చర్చించి విద్యార్థులను కలుపుకొని పోరాటాలకు శ్రీకారం చుడతాం అన్నారు….ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు హరి. ప్రశాంత్. ప్రమోద్ తదులు పాల్గొన్నారు..అభినందనలతోRSU జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్

Related posts

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

ఏపీలో ఈ రోజు 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన

TV4-24X7 News

Leave a Comment