భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న దిల్లీలోని భవనం రూ.1,100 కోట్లకు అమ్ముడైంది. దిల్లీలోని లుటియెన్స్ బంగ్లా జోన్ (LBZ)లోని 17 యార్క్ రోడ్ (ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ మార్గ్) వద్ద ఉన్న ఈ భవనం NCR లోని అత్యంత విలువైన చిరునామాల్లో ఒకటి. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి పానీయాల రంగానికి చెందిన ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త అని సమాచారం.
