వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది.
ఈ ఏడాది ఇప్పటివరకు $158b ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికమని పేర్కొంది. INDపై 50% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.