ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని అన్నారు.
ధైర్యం ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చ పెట్టమని సవాల్ విసిరారు.మాజీ సీఎం జగన్‌తో పాటు సజ్జల కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని, రైతుల ధాన్యం బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపించారు. తాము ఎలాంటి విమర్శలకు బెదరమని బుచ్చయ్య స్పష్టం చేశారు.