కడప:జిల్లాను మరో ఏడాదిలో జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులు, సిబ్బందిని పిలుపునిచ్చారు.ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలు సాధించిన సందర్భంగా శనివారం మాధవి కన్వెన్షన్ హాలులో “సంపూర్ణత అభియాన్ సత్కార కార్యక్రమం” ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్‌తో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పాల్గొన్నారు.ముందుగా విభాగాల ప్రదర్శన స్టాళ్లను వీక్షించిన అనంతరం, సభలో భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాకుల్లో నీతి ఆయోగ్ గుర్తించిన వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమం, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణ–పట్టణాభివృద్ధి రంగాల్లో “సంపూర్ణత అభియాన్”ను విజయవంతం చేస్తున్నామన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

previous post