Tv424x7
Andhrapradesh

చేపల వేటకు వెళ్లి భార్య భర్త మృతి!

అనాధలుగా మారిన ఇద్దరు చిన్నారులు.

మానవ సేవయే మాదవ సేవ ద్వారా దాతల సహాయం కోసం విజ్ఞప్తి.

అందరికీ నమస్కారం..🙏🙏

జోగులంబ గద్వాల జిల్లా:
గద్వాల నియోజకవర్గం, మల్దకల్ మండలం, సెప్టెంబర్ 3, 2025 నాడు తాటికుంట గ్రామం సమీపంలో ఉన్న రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు భార్యాభర్తలు దుబ్బని బావి రాముడు మరియు సంధ్యా. ప్రతిరోజు చేపల వేటకు వెళ్లి జీవనం సాగించేవారు రాముడు సంధ్య.

ఈ క్రమంలోనే విధి వక్రీకరించడంతో చేపలు పట్టే క్రమంలో రిజర్వాయర్ లో చేపల పుట్టి మునిగి చనిపోవడం జరిగింది. భార్యాభర్తలు చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు చైతన్య 10 సంవత్సరాలు 4వ తరగతి, లక్కీ 8 సంవత్సరాలు 2వ తరగతి చదువుతున్న ఈ చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు.

కుటుంబ పెద్దలు మరణించడంతో అనాధలుగా మిగిలిపోయిన చిన్నారులకు మానవ సేవ మాధవ సేవ ద్వారా దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారులకు మీకు తోచినంత ఆర్థిక సాయం అందించి అనాధలుగా మిగిలిపోకుండగా ఆ చిన్నారులను ఆదుకోవాలని ఈ మానవసేవయే మాదవ సేవ ద్వారా దాతలను కోరడం జరుగుతుంది. పిల్లలకు మన వంతు తోచినంత ఆర్థిక సాయం చేసినట్లయితే వారి భవిష్యత్తుకు ఎంతో మేలు చేసిన వారవుతాము.

Related posts

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

TV4-24X7 News

అమరావతిలో భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

TV4-24X7 News

సామాజిక సేవలో ఎస్ జీ ఎస్

TV4-24X7 News

Leave a Comment