Tv424x7
Andhrapradesh

అమరావతిలో భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ..

అమరావతి: రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది..మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్‌, టీజీ భరత్‌ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు..గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేయనున్నారు. కొత్తగా వచ్చే సంస్థలకు చేయాల్సిన కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కమిటీ చర్చించనుంది. గతంలో 120కి పైగా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాల నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115కు పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి..

Related posts

రాష్ట్రపతి ఆమోదం అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News

జగన్నాథుడి రథయాత్ర ప్రధాని మోదీజీ వీడియో రిలీజ్

TV4-24X7 News

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

TV4-24X7 News

Leave a Comment