మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొల్లాపురం శివారు ఇప్పతండాలో రాత్రి ఓ యువకుడు.. యువతిపై లైంగికదాడికి యత్నించి పరారయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం..రాత్రి గ్రామంలో గణపతి నిమజ్జన వేడుకలు జరుగుతుం డగా తల్లిదండ్రులు వెళ్లారు. అదే అదునుగా భావించిన సదరు యువకుడు.. యువతిపై లైంగికదాడికి యత్నించగా కేకలు వేసింది. ఈ కేకలు విని యువతి తండ్రి వస్తుండగా ఆ యువకుడు పరారయ్యాడు..