విజయవాడలో ఎస్సై దౌర్జన్యం – మహిళా నాయకురాలిపై బూతులు.
విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో పెద్ద వివాదం చెలరేగింది.
ఓ చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ మహిళా నాయకురాలిని స్థానిక ఎస్సై నోటికొచ్చినట్లు బూతులు తిట్టి అవమానపరిచాడు.
మహిళా నాయకురాలు తన అభిప్రాయం చెబుతున్న సమయంలో ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేసి, ఆపదవచనాలు వాడుతూ దౌర్జన్యం ప్రదర్శించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎస్సై ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
🔹 ప్రజలు ప్రశ్నిస్తున్నారు –
“పోలీస్ ఆఫీసరా? లేక రౌడీ షీటరా?”
🔹 బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎస్సైపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.