నిర్మల్ పట్టణం, లక్ష్మణచాంద :
నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పత్రాలతో కూడిన సంచిని యజమానికి తిరిగి అప్పగించి ఓ ఆటోడ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు.
కడెం మండలానికి చెందిన సుజాత నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం తయారు చేసిన 16 తులాల బంగారం, నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచి ఆమె వాహనం నుండి బైపాస్ వద్ద జారిపోయింది.ఆ సమయంలో ఆటోడ్రైవర్ సాయికుమార్ తన వాహనంలో ప్రయాణికులను తీసుకెళ్తుండగా, ప్రయాణికురాలు సౌజన్య ఆ సంచిని గుర్తించి అతనికి తెలిపింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లిన సాయికుమార్ తర్వాత సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని, ఆదివారం సుజాతకు ఆభరణాలు, నగదు, పత్రాలు అందజేశాడు.
ఈ ఘటనతో సాయికుమార్ నిజాయతీని గ్రామస్థులు ప్రశంసించారు. ఆయనను ఘనంగా సన్మానించారు. 👏