అనంతపురం సీమ రత్నం సెప్టెంబర్ 7
పెద్దపప్పూరు మండల కేంద్రం అన్ని సంఘాల ఏకతా శక్తితో మార్మోగింది.
చాగల్లు గ్రామానికి చెందిన రాష్ట్ర వాల్మీకి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వాల్మీకి సేవాదళ్ సంఘం పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్యను పరామర్శించడానికి వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆయనపై చూపుతున్న సంఘీభావం ప్రజల్లో విశేష చర్చనీయాంశమైంది.
జై వాల్మీకి నినాదాలతో మండల కేంద్రం మార్మోగింది
ఈ పరామర్శ కార్యక్రమంలో తెలికి శ్రీరాములు, మామ బయన్న శ్రీనివాస్ పురం, అన్న శివ తదితర వాల్మీకి సంఘాల ప్రతినిధులు “జై వాల్మీకి” నినాదాలతో సభ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
వాల్మీకి సంఘాల ఐక్యతను చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రైతు నాయకుల పరామర్శ
రైతు నాయకులు పుష్ప నారాయణరెడ్డి, ఉల్లికల్లు రంగారెడ్డి బుల్లెట్ లింగమయ్యను వ్యక్తిగతంగా పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. “వాల్మీకి సంఘం కోసం బుల్లెట్ లింగమయ్య చేస్తున్న పోరాటం ప్రశంసనీయం. ఇలాంటి సమయంలో అందరం కలిసే ఉండాలి” అని వారు పేర్కొన్నారు.
స్థానిక నేతల మద్దతు
అదేవిధంగా ముచ్చుకోట బయన్న వాల్మీకి నల్లప్ప.