తంగెళ్లపల్లి – హైదరాబాద్:
ఆర్ఆర్ఆర్ రోడ్డును పచ్చని పంట భూములపై వేయొద్దంటూ తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు హెచ్ఎండిఏకి వినతిపత్రం సమర్పించారు.రైతులు మాట్లాడుతూ – “తరతరాలుగా వ్యవసాయం ఆధారంగా మా కుటుంబాలు జీవిస్తున్నాయి.
100 ఎకరాల ఉరి చెరువు నీటి వసతితో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నాం. వరి, మొక్కజొన్న, పండ్ల తోటలు, కూరగాయల సాగు మా జీవనాధారం. ఈ పచ్చని పొలాల్లోంచి రోడ్డువేయడం వలన మా బతుకులు అస్తవ్యస్తం అవుతాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ బంజరు భూముల్లో రహదారి వేయాలని, రైతుల భూములు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. “రహదారులు వేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పేద రైతుల భూముల్లోంచి రోడ్డు వేయడం అన్యాయం” అని రైతులు విమర్శించారు.
వినతిపత్రం సమర్పణలో పి. రవీందర్ రెడ్డి, పి. పెర్మల్ రెడ్డి, కే. బాలరాజ్, కే. శేకర్, ఎస్. శ్రీశైలమ్, కె. పోషయ్య, జి. వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.