: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. గాజా (Gaza) ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించే ప్రయత్నాలను ఇజ్రాయెల్ వేగవంతం చేసింది.
ఈ క్రమంలో ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ సోషల్ మీడియా ఎక్స్‌లో చేసిన ప్రకటన కలకలం రేపింది.“రాత్రికి హరికేన్‌లా విరుచుకుపడతాం… హమాస్ దాచుకునే చోటు ఎక్కడా ఉండదు” అని ఆయన హెచ్చరించారు. గాజా ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే గాజా ప్రాంతం దాదాపు శిథిలావస్థలో ఉండగా, ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరంగా మారనున్నట్లు సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
అంతర్జాతీయ సమాజం మాత్రం ఈ యుద్ధ విస్తరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాంతి చర్చలు జరిపే ప్రయత్నాలు విఫలమవుతుండగా, పౌరుల ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి పునరుద్ఘాటిస్తోంది.
ఇక హమాస్ వర్గాలు మాత్రం ఇజ్రాయెల్ హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రతిఘటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అనూష