మహారాష్ట్ర తీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకువచ్చాయి. దీంతో అధికారులు తీరప్రాంత గ్రామాలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలో లభించే ఎలాంటి వస్తువులను ముట్టుకోవద్దని సూచించారు. ఆగస్టులో ఒమన్ కార్గోషిప్ నుంచి పడిపోయిన కంటైనర్లే ఇవి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
