ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యతను నిర్మూలించే లక్ష్యంతో 1965 సెప్టెంబరు 8 నుంచి 19 వరకు టెహ్రాన్‌లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని దేశాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు.
‘అందరికీ విద్య’ను ప్రోత్సహించేందుకు, లక్ష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 1966 అక్టోబరు 26న యునెస్కో సెప్టెంబరు 8ను ‘అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం’గా ప్రకటించింది. 1967 నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.